డిగ్రీలో 30శాతంలోపు ప్రవేశాలున్న
కోర్సులు మూత - ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల
పెంపు
కళాశాల విద్యా శాఖ ఆదేశాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 30శాతంలోపు ప్రవేశాలున్న కోర్సులను మూసివేయనున్నారు. వీటిల్లో చేరిన విద్యార్థుల అంగీకారం మేరకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలను ఇటీవల మూడు విడతల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఇప్పుడు 30 శాతంలోపు విద్యార్థులు చేరిన కోర్సులను నిర్వహించడం సాధ్యం కాదని కళాశాల విద్యాశాఖ పేర్కొంటోంది. విద్యార్థులు ప్రస్తుతం చేరిన కోర్సులో కాకుండా వేరే కోర్సులో చేరతామంటే అదే కళాశాలలో సర్దుబాటు చేయడం, లేదంటే ఇతర కళాశాలల్లో చేరే అవకాశం కల్పించాలని ప్రిన్సిపాళ్లను కమిషనర్ నాయక్ ఆదేశించారు. వారి కోసం ఆయా కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారు. దీనిపై కళాశాల విద్య కమిషనర్ నాయక్ మాట్లాడుతూ.. ‘‘కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులందరికీ వారు కోరుకున్న కోర్సులు, కళాశాలల్లో సీట్లను సర్దుబాటు చేస్తాం.’’ అని వెల్లడించారు.
ఎంబీఏ, ఎంసీఏ
కోర్సుల్లో సీట్ల పెంపు
ప్రైవేటు ఎంసీఏ, ఎంబీఏ
కోర్సుల్లో సీట్లను పెంచుతూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఉత్తర్వులు జారీ చేశారు. మూడు ఎంసీఏ, ఒక ఎంబీఏ కళాశాలలో
గతంలో 60 సీట్లు చొప్పున ఉండగా.. వీటిని 120కి పెంచారు. మరో ఎంబీఏ కళాశాలలో 180
సీట్లు ఉండగా వీటిని 240కి పెంచారు. చిత్తూరులో ప్రైవేటు కళాశాలకు అదనపు కోర్సులను
మంజూరు చేశారు. ఎంబీఏలో బిగ్‌డాటా అనాలసిస్, బ్యాంకింగ్,
ఫైనాన్స్, హెల్త్‌కేర్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు అనుమతించారు. నెల్లూరులో కొత్తగా
ఎంబీఏ కళాశాలకు అనుమతి తెలిపారు.
0 Komentar