Djokovic Sets New All-Time Record for
Weeks at No. 1 In ATP Rankings
నొవాక్ జకోవిచ్ అంతర్జాతీయ టెన్నిస్‌లో
సరికొత్త రికార్డు: 311 వారాలు నం.1
సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ అంతర్జాతీయ టెన్నిస్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన ఆటగాడిగా చరిత్రకు ఎక్కాడు. రోజర్ ఫెదరర్ 310 వారాల రికార్డును బద్దలు కొట్టాడు. ఐదు దఫాల్లో 311 వారాలు అగ్రస్థానంలో నిలిచాడు.
ఇప్పటి వరకు జకోవిచ్ 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచాడు. గత నెల్లోనే తొమ్మిదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా 36 ఏటీపీ మాస్టర్స్ 1000 ట్రోఫీలు సొంతం చేసుకోవడం గమనార్హం. 2011, జులై 4న తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించిన జకో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014-16 మధ్య ఏకంగా 122 వారాలు అగ్రస్థానంలో కొనసాగాడు. అప్పుడప్పుడు ఫెదరర్, నాదల్ నుంచి పోటీ ఎదురైనా తట్టుకొన్నాడు. 2018, మే 21న 22వ ర్యాంకుకు చేరుకున్న అతడు 2018 నవంబర్లో తిరిగి టాప్-5లో ప్రవేశించాడు. ఆ తర్వాత రెండు దఫాల్లో 88 వారాలు నంబర్‌వన్‌గా కొనసాగాడు.
‘టెన్నిస్‌లో దిగ్గజాల సరసన,
వారి బాటలో నడుస్తున్నందుకు గర్వంగా అనిపిస్తోంది. అగ్రస్థానంలో
ఉండాలని చిన్ననాటి నుంచి కలగనే వాడిని. ప్రేమ, పట్టుదల,
అంకితభావంతో పనిచేస్తే ప్రతిదీ సాధ్యమే’ అని నొవాక్ అంటున్నాడు.
కాగా గతంలో పీట్ సంప్రాస్ 286, ఇవాన్ లెండిల్ 270,
జిమ్మీ కానర్స్ 268 వారాలు అగ్రస్థానంలో
ఉండటం గమనార్హం.
0 Komentar