Dozens of Dead Sea Scroll Fragments From
1,900 Years Ago Found in Deserted Israeli Cave
ఇజ్రాయెల్‌లో 1900 ఏళ్ల నాటి రాత ప్రతులు లభ్యం!
బైబిల్ వచనాలున్న పురాతన చర్మపత్ర భాగాలను ఇజ్రాయెల్ పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి 1900 సంవత్సరాల క్రితం నాటివని భావిస్తున్నారు. రోమ్‌కు వ్యతిరేకంగా యూదుల తిరుగుబాటుకు సంబంధించిన అంశాలు వీటిలో ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. బైబిల్ సంకలనంలోని జెకర్యా, నహూము గ్రంథాలకు చెందిన అంశాలు; 12 మంది చిన్న ప్రవక్తల వ్యాఖ్యానాలు... తమకు లభించిన 80 గ్రీకు ప్రతుల్లో ఉన్నట్టు ఇజ్రాయెల్ పురాతత్వ సంస్థ (ఐఏఏ) పేర్కొంది.
క్రీ.శ. 1-3 శతాబ్దాలకు చెందిన ఇలాంటి పత్రాలు, తొలుత వెస్ట్ బ్యాంక్‌లోని మృత సముద్రానికి ఉత్తరాన ఉన్న కుమ్రాన్
గుహల్లో 1940-50 మధ్య లభ్యమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు
జెరూసలేంకు దక్షిణాన ‘కేవ్ ఆఫ్ హారర్’గా పిలిచే గుహలో ఇవి లభ్యం కావడం విశేషం!
0 Komentar