Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO DEAL Recruitment 2021: Applications Invited for 71 Apprentice Vacancies

 

DRDO DEAL Recruitment 2021: Applications Invited for 71 Apprentice Vacancies

డీఆర్‌డీఓ అప్రెంటిస్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల - ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు

DRDO 71 Apprentice Vacancies: డెహ్రడూన్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ (DEAL) ఉద్యోగాలకు 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు

మార్చి 12 దరఖాస్తులకు చివరితేది

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 71 అప్రెంటిస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డెహ్రడూన్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబరేటరీ(DEAL) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు ఈ పోస్టులకు అప్లయ్‌ చేయొచ్చు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 71

డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ- 24

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 7

మెకానికల్ ఇంజనీరింగ్- 4

కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్- 13

ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ- 47

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 24

మెషినిస్ట్- 7

టర్నర్- 6

ఫిట్టర్- 10 

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేయాలి.

వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్‌ http://portal.mhrdnats.gov.in/ లో, అలాగే ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థులు https://apprenticeshipindia.org/ పోర్టల్‌లో అప్లయ్‌ చేయాలి.

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 12, 2021

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags