EPF Rule Tweaked: Now, Earn Tax-Free
Interest on Contributions of Up to Rs 5 Lakh
పీఎఫ్ వడ్డీపై పన్ను డిపాజిట్
పరిమితి రూ.2.5లక్షల నుండి రూ.5 లక్షలకు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలాసీతారామన్ వెల్లడి
ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్)లో రూ.2.5లక్షల వరకూ డిపాజిట్ మొత్తంపై పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీన్ని రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక బిల్లు -2021లో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక పెట్టారు.
సాధారణంగా ఈపీఎఫ్ చట్టం ప్రకారం నిర్బంధ చందా కింద వేతనం (మూల వేతనం, డీఏ)లో 12శాతం ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్‌లో జమచేయాలి. అంతే మొత్తం యాజమాన్యం తన వాటా కింద చెల్లిస్తుంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించిన ప్రకారం రూ.5 లక్షల వరకూ డిపాజిట్ చేసే మొత్తంపై పన్ను మినహాయింపు కేవలం యాజమాన్యం వాటా 12 శాతానికి మించిలేని చందాకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై
ఆర్జించే వడ్డీకి తాజా బడ్జెట్‌లో కొత్త నిబంధనలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
దీని ప్రకారం.. ఇకపై రూ.2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే
వడ్డీకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆపై జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి
వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇది ఏప్రిల్ 1, 2021 నుంచి చేసే జమలకే వర్తించనుంది. అధిక వేతనాలు తీసుకుంటున్న ఉన్నతోద్యోగుల
ఆదాయంపై పన్ను మినహాయింపును హేతుబద్ధీకరణ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
0 Komentar