EPFO Closed 71.01 lakh EPF Accounts in
April-December 2020
గత ఏడాది 71.01 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు మూత
గత ఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) 71.01 లక్షల ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాల్ని మూసివేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ సోమవారం పార్లమెంటుకు తెలిపారు. 2019లో ఇదే సమయంలో 66.66 లక్షల ఖాతాల్ని మూసివేసినట్లు వెల్లడించారు. ఉద్యోగ విరమణ, ఉద్యోగం కోల్పోవడం, వేరే ఉద్యోగానికి లేదా సంస్థకు మారడం వంటి పలు కారణాల వల్ల ఈపీఎఫ్ ఖాతాను మూసివేస్తుంటారు.
ఇక ఏప్రిల్-డిసెంబరు మధ్య పాక్షికంగా నగదు ఉపసంహరించుకున్న ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 2019లో 54,42,884 ఉండగా.. ఈసారి అది 1,27,72,120కి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఉపసంహరించిన మొత్తం రూ. 55,125 కోట్ల నుంచి రూ.73,498కి పెరిగింది. ఇక కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికీ, అటువంటి వారికి కొత్తగా ఉపాధి కల్పించిన సంస్థల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకాన్ని ఫిబ్రవరి 28 నాటికి 1.83 లక్షల సంస్థలు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తద్వారా 15.30 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాల పరిధిలోకి వచ్చారని తెలిపింది. ఇక గత నెలాఖరు నాటికి ఈ పథకం అమలు కోసం 186.34 కోట్లు విడుదల చేసినట్లు చెప్పింది.
మరోవైపు ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్
ఫండ్లలో ఫిబ్రవరి 28 నాటికి రూ.27,532
కోట్లు ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెట్టినట్లు మరో సమాధానంలో గంగ్వార్ తెలిపారు. అలాగే
లాక్‌డౌన్ సమయంలో 31,01,818 క్లెయింలను ఈపీఎఫ్‌ఓ సెటిల్
చేసినట్లు పేర్కొన్నారు.
0 Komentar