Facebook Disabled 130 Crore Fake Accounts in October-December Last Year
130కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు
ఫేస్‌బుక్ వెల్లడి
గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య 130కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్ సోమవారం వెల్లడించింది. తమ సామాజిక మాధ్యమ వేదికపై తప్పుడు, నకిలీ సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు 35వేల మందికి పైగా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫేస్‌బుక్ తమ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కొవిడ్ 19, కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం చేరవేసేలా ఉన్న 12 మిలియన్లకు పైగా పోస్టులు, వీడియోలను తొలగించినట్లు సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.
గతేడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వైరస్, కొవిడ్ వ్యాక్సిన్లపై సోషల్‌మీడియాలో అనేక వదంతులు, తప్పుడు కథనాలు వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే ఈ కథనాలపై ప్రపంచ ఆరోగ్య నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో ఆయా సంస్థలు చర్యలు చేపట్టాయి. నకిలీ వార్తలపై దృష్టిపెట్టి ఆయా ఖాతాలు, పోస్టులను తొలగించాయి.
0 Komentar