Google Chrome's new Live Caption feature
will transcribe speech in videos, here’s how to enable it
గూగుల్ క్రోమ్ క్రొత్త లైవ్
క్యాప్షన్ ఫీచర్ - వీడియో,
ఆడియోల లైవ్ క్యాప్షన్స్‌ని చూడొచ్చు - ఎనేబుల్ చేసుకోండీ ఇలా
ఇకపై క్రోమ్
యూజర్లు లైవ్ క్యాప్షన్స్‌ని పెట్టుకోవచ్చు. క్రోమ్ బ్రౌజర్‌లో అందుకు కావాల్సిన
ఆప్షన్‌ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. పీసీ యూజర్లు ఈ సదుపాయాన్ని వాడుకునేలా
క్రోమ్ అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందిస్తోంది. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో
చూద్దాం.
లైవ్
క్యాప్షన్స్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలంటే ముందు, మీరు వాడుతున్న
బ్రౌజర్ కొత్త వెర్షన్‌కి (89.0.4389.90) అప్‌డేట్
అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. అందుకు మీరు ఏం చేయాలంటే.. క్రోమ్‌లోని ‘అబౌట్
క్రోమ్’లోకి వెళ్లి చూడండి. అక్కడ ఒకవేళ పాత వెర్షన్‌లోనే బ్రౌజర్ ఉంటే వెంటనే
అప్‌డేట్ చేసి, బ్రౌజర్‌ని రీలాంచ్ చేయండి. కొత్త వెర్షన్‌కి
అప్‌డేట్ అవుతుంది. ఇప్పుడు లైవ్ క్యాప్షన్స్ ఫీచర్‌ని ఎనేబుల్ చేయాలి.
అందుకు.. బ్రౌజర్ సెట్టింగ్స్‌లోని ‘అడ్వాన్స్’ విభాగాన్ని చూడండి. దాంట్లో
యాక్సెసబిలిటీ సెక్షన్‌లోకి వెళ్తే క్యాప్షన్ టాగిల్ కనిపిస్తుంది. డీఫాల్ట్‌గా
డిసేబుల్‌గా ఉన్న ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. అంతే.. ఇకపై మీరే మీడియా ఫైల్ ఓపెన్
చేసినా లైవ్ క్యాప్షన్స్‌ని చూడొచ్చు.
Enable Live Caption in
Google Chrome - VIDEO
Check
the PDF for How to enable live captions in Chrome
యూట్యూబ్ లేదా
మరేదైనా పాడ్‌క్యాస్ట్ సర్వీసు ఓపెన్ చేయండి. మీరు ఎంపిక చేసుకున్న మీడియా ఫైల్‌ని
ఓపెన్ చేస్తే చాలు. క్రోమ్‌లో ఆటోమాటిక్‌గా క్యాప్షన్స్ ప్రారంభం అవుతాయి.
బ్రౌజర్ కింది భాగంగా డీఫాల్ట్‌గా కనిపిస్తాయి. కావాలంటే మీరు వాటిని తెరపై
ఎక్కడికైనా జరుపుకోవచ్చు. ఉదాహరణకు మీరు గూగుల్ పాడ్‌క్యాస్ట్‌లో ఏదైనా ఆడియో
ఫైల్‌ని ఓపెన్ చేయండి. వెంటనే కింద క్యాప్షన్స్ ప్లే అవ్వడం చూస్తారు.
క్యాప్షన్స్ విండో కనిపించే ‘డౌన్ యారో’ని సెలెక్ట్ చేస్తే.. బాక్స్ పరిమాణం
పెరుగుతుంది. దీంతో క్యాప్షన్స్ అన్నీ పేరాగ్రాఫ్‌గా కనిపిస్తాయి. వ్యాసం
మాదిరిగా చదువుకోవచ్చు. ఒకవేళ క్యాప్షన్స్ వద్దు అనుకుంటే క్లోజ్ బటన్‌ని
సెలెక్ట్ చేయాలి. క్రోమ్ అందించే మీడియా కంట్రోల్స్ నుంచి కూడా క్యాప్షన్స్‌ని
ఎనేబుల్,
డిసేబుల్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ క్యాప్షన్స్ ఫీచర్ వినికిడి సమస్య
ఉన్నవారికి ఎంతో ఉపయుక్తం.
0 Komentar