Google Pay Adds News Privacy Features;
Users Will Now Be Able to Delete Transaction Details
గూగుల్ పే యూజర్లకు కొత్త సర్వీసులు - ట్రాన్సాక్షన్ వివరాలను సులభంగా మేనేజ్ చేయొచ్చు
మీకోసం అదిరిపోయే ఫీచర్ ఒకటి అందుబాటులో ఉంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. యాప్ అప్‌డేట్ తర్వాత ఈ బెనిఫిట్స్ పొందొచ్చు.
ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ గూగుల్ పే తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల గూగుల్ పే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. ఎక్కువ సౌలభ్యం లభంచనుంది.
ట్రాన్సాక్షన్ వివరాలను సులభంగా
మేనేజ్ చేయొచ్చు. ఇండివీజువల్ ట్రాన్సాక్షన్లను చూసుకోవడం, వాటిని
డిలేట్ చేసుకోవడం చేయొచ్చు. ఇంకా పర్సనలైజేషన్ ఆప్షన్‌ను ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు. వచ్చే వారం నుంచి గూగుల్ పే యాప్ సెట్టింగ్స్‌లో కొత్త
ఫీచర్‌ను గమనించొచ్చు.
గూగుల్ పే యాప్ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్సనలైజేషన్ కంట్రోల్ ఆప్షన్‌ను ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే పలు రకాల సౌలభ్యాలు పొందొచ్చు. యాప్‌లో మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ, యాక్టివిటీకి అనుగుణమైన ఆఫర్లు, రివార్డు వంటివి కనిపిస్తాయి.
అదే మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్
చేసుకుంటే గూగుల్ పే ఎప్పటి లాగానే పని చేస్తుంది. పర్సనలైజేషన్ సౌలభ్యాలు పొందలేరు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై గూగుల్ పే యాప్‌ను అప్‌డేట్
చేసుకున్న తర్వాత పర్సనలైజేషన్ సెట్టింగ్స్‌ను మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.
0 Komentar