నేటి నుండి ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు
- వడగాల్పులు వీచే అవకాశం
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
తెలిపిన ప్రకారం నేటి (Mar 27) నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాల్పులు మొదలు
కానున్నప్పటికీ ఆదివారం నుంచి మరింత ఉధృతరూపం దాల్చనున్నాయి. మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94
మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాల్పులు
వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. విజయనగరం,
విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం
జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే
దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 1నుంచి
ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని చెబుతున్నారు.
0 Komentar