India Score in QS Subject Ranking:
Twelve Indian Institutes in the Top 100
క్యూఎస్ వరల్డ్ సబ్జెక్ట్
ర్యాంకింగ్స్: టాప్-100లో 12 భారతీయ విద్యాసంస్థలు
విద్యాసంస్థల ప్రమాణాలకు అద్దం
పట్టే క్యూఎస్ వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ లో 12 భారతీయ
విద్యాసంస్థలు నిలిచాయి. ఇందులో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ
ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగపుర్, ఐఐఎస్ సీ
బెంగళూరు, ఐఐటీ గువాహటి, ఐఐఎం బెంగళూరు,
ఐఐఎం అహ్మదాబాద్, జేఎన్ యూ, అన్నా యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మార్చి 04న ఒక ప్రకటనలో తెలిపింది. పెట్రోలియం ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ 30వ ర్యాంకు, మినరల్స్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ లో
ఐఐటీ బాంబేకి 41, ఐఐటీ ఖరగ్ పుర్ కి 44
ర్యాంకులు వచ్చినట్లు పేర్కొంది. డెవలప్ మెంట్ స్టడీలో దిల్లీ యూనివర్సిటీ 50వ ర్యాంకు పొందినట్లు వెల్లడించింది.
ఓవరాల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో
మాత్రం ఐఐటీ బాంబే 172, ఐఐఎస్సీ బెంగళూరు 185, ఐఐటీ దిల్లీ 198వ ర్యాంకులు సంపాదించాయి. 200లోపు స్థానాలు ఈ మూడు సంస్థలకు మాత్రమే దక్కాయి. హైదరాబాద్ ఐఐటీ 601-650 ర్యాంకులో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) 651-100 ర్యాంకు దక్కించుకొంది. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)కి వెయ్యికి
పైన ర్యాంకు వచ్చింది. ఓవరాల్ టాప్-1000 ర్యాంకుల్లో 29
భారతీయ విద్యాసంస్థలకు మాత్రమే చోటు దక్కింది. ప్రపంచంలోని 85
ప్రాంతాలకు చెందిన 1440 విశ్వవిద్యాలయాలు
అందిస్తున్న 14 వేల కోర్సులు/ కార్యక్రమాలపై క్యూఎస్ సంస్థ
విశ్లేషించింది.
0 Komentar