ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021.. 14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు వేదికలు, మ్యాచ్‌ల తేదీలు ఖరారు చేస్తూ బీసీసీఐ ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను వేదికలుగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి పోరు జరగనుండగా, మే 30న మొతేరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే ఫ్లేఆఫ్స్ కూడా మొతేరా స్టేడియంలో నిర్వహిస్తుండటం గమనార్హం.
గతేడాది కరోనా వైరస్ కారణంగా
సుమారు ఆరు నెలలు వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్.. చివరికి
సెప్టెంబర్‌లో యూఏఈకి తరలిపోయింది. అక్కడ ప్రత్యేకంగా బయోబబుల్ ఏర్పాటు చేసి
ఆటగాళ్లకు నిరంతరం పరీక్షలు చేస్తూ ఆ మెగా ఈవెంట్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ముంబయి ఇండియన్స్ ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అయితే, ఇప్పుడు
దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, స్టేడియాలకు
అభిమానులను కూడా 50 శాతం అనుమతిస్తుండడంతో బీసీసీఐ ఈసారి
ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎనిమిది ఫ్రాంఛైజీలకు ఎనిమిది
వేదికలకు బదులు ఆరు నగరాలనే ఎంపిక చేసింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్,
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ జట్లు
తమ సొంత మైదానాలను కోల్పోయాయి.
0 Komentar