JEE Main - 2021 March
Admit Card Released and Change in the Exam Dates
జేఈఈ మెయిన్-2021 మార్చి సెషన్ అడ్మిట్ కార్డు విడుదల - పరీక్షల ప్రారంభ తేదీ మార్పు
జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్లైన్
పరీక్షల ప్రారంభం తేదీ మారింది. రెండో విడత పరీక్షలు మార్చి 15న మొదలై 18వ తేదీకి
పూర్తవుతాయని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టిఏ) నెల క్రితమే ప్రకటించింది. తాజాగా ఈ
పరీక్షలు ఈ నెల 16న ప్రారంభమవుతాయని, 18వ తేదీన ముగుస్తాయని
వెల్లడించింది. నాలుగు రోజులపాటు జరిపేందుకు సరిపడా దరఖాస్తులు రాకపోవడంతో పాటు
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల కోసం పేపర్-2 పరీక్ష
లేకపోవడంతో ఈ నెల 15వ తేదీకి బదులు 16న ప్రారంభి స్తున్నారు. దేశంతోపాటు మరికొన్ని
దేశాల్లో కలిపి 331 నగరాలు/పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ
తెలిపింది.
ఫిబ్రవరిలో జరిగిన మెయిన్ పేపర్-1
పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,52,627 మంది దరఖాస్తు
చేశారు. మార్చి పరీక్షలకు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చి ఉండొచ్చని అంచనా
వేస్తున్నారు. ఫలితంగా పరీక్షల నిర్వహణను మూడు రోజులకే పరిమితం చేశారు. తెలుగు
రాష్ట్రాల నుంచి జనవరిలోనే మార్చి పరీక్షల కోసం దాదాపు 1.07 లక్షల మంది దరఖాస్తు
చేశారు. తాజాగా ఈ నెల 10వ తేదీ వరకు మరోసారి అవకాశం కల్పించడంతో మరికొద్ది వేలమంది
దరఖాస్తు చేసి ఉండొచ్చని చెబుతున్నారు. హాల్ టికెట్లను గురువారం నుంచి తమ వెబ్
సైట్ లో ఉంచామని.. డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ కోరింది.
0 Komentar