జేఈఈ మెయిన్స్-2021 రెండో విడత ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్స్ రెండో విడత
ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 16,17,18 తేదీల్లో జేఈఈ
మెయిన్స్ పేపర్-1 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 6,19,000 మంది రిజిస్టర్ చేసుకోగా 5,90,000 మంది
హాజరయ్యారు. 300 మార్కులకు పరీక్ష నిర్వహించగా 13 మంది 100 పర్సెంటైల్ స్కోర్ సాధించారు. ఇదిలా
ఉంటే దేశంలో తొలిసారిగా ఒక ఏడాదిలో నాలుగుసార్లు ఈ పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ
నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే పరీక్షల
రిజిస్ర్టేషన్‌కు ఎన్‌టీఏ గురువారం నుంచి అవకాశం కల్పించనుంది.
వంద శాతం మార్కులు సాధించిన తొలి
మహిళా అభ్యర్థిగా సరికొత్త రికార్డు
తాజాగా విడుదల చేసిన జేఈఈ పరీక్షా
ఫలితాల్లో ఢిల్లీకి చెందిన కావ్య చోప్రా రికార్డు సృష్టించింది. జేఈఈ మెయిన్స్ 2021లో 300 మార్కులకు 300 మార్కులు
సాధించిన కావ్య.. వంద శాతం మార్కులు సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా సరికొత్త
చరిత్ర సృష్టించింది. ఇక కావ్య.. ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలో 99.9 శాతం మార్కులు సాధించగా ఇప్పుడు ఏకంగా 100 శాతం
దక్కించుకుంది.
0 Komentar