KRAS Launches Medium Range Missile Kits for
Armed Forces
భారత సైన్యానికి మిస్సైల్ కిట్ అందించిన
కేఆర్‌ఏఎస్
ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను
ఛేదించే మధ్యతరహా క్షిపణి (ఎంఆర్‌ఎస్‌ఏఎం) లోని కీలక భాగాన్ని ఉత్పత్తి చేసిన
కల్యాణి రఫేల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (కేఆర్‌ఏఎస్) తమ తొలి కిట్‌ను మంగళవారం
భారత్ సైన్యం, వైమానిక దళానికి అందించింది. భారతదేశపు కల్యాణి గ్రూపు,
ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్
ఉమ్మడి సంస్థే కేఆర్‌ఏఎస్.
హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన
ఉత్పత్తి కేంద్రంలో ఈ కిట్‌లు రూపొందిస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో
అభివృద్ధి చేసి, అంతిమంగా ఉపయోగించేందుకు సిద్ధం చేసేందుకు భారత్
డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు అప్పగించింది. మొత్తం 1,000 ఎంఆర్‌ఎస్‌ఏఎంల కోసం కిట్ తయారు చేసి, అందించేందుకు
10 కోట్ల డాలర్ల (సుమారు రూ.730 కోట్ల)
ఒప్పందాన్ని ఈ సంస్థ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్
సిస్టం మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అధిపతి ఫిన్‌హాస్ యంగ్‌మన్ మాట్లాడుతూ
భారత్ తయారీలో భాగంగా దీన్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్లు, భవిష్యత్తులో ఎగుమతులకూ అవకాశం ఉందని తెలిపారు.
కేఆర్‌ఏఎస్ సీఈఓ రుద్ర జడేజా
మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 1,000 మిస్సైళ్లు అందించే సామర్థ్యం తమకు
ఉందని, డీఆర్‌డీఓ అవసరాల మేరకు వీటిని అందిస్తామన్నారు.
హైదరాబాద్ నుంచి స్పైస్ 2000ను 200
యూనిట్లు ఉత్పత్తి చేశామని, దీనికి ఇక్కడి ఎన్నో ఎంఎస్‌ఎంఈలు
సహకరించాయన్నారు. గిరాకీ పెరిగితే తెలంగాణలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు
చేసే అవకాశం లేకపోలేదన్నారు.
0 Komentar