List Schools Blocked for online NR
Submission due to not having the Renewal Recognition Orders
రాష్ట్రవ్యాప్తంగా 259 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు
రాష్ట్రవ్యాప్తంగా 259 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరంతో గుర్తింపు గడువు ముగిసిందని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. చాలా సార్లు హెచ్చరించినప్పటికీ ప్రైవేటు యాజమాన్యాల్లో కదలిక కానరా లేదన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్లైన్ నామినల్ రోల్స్ ను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
ఈ ఏడాది జూన్‌లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులంతా సంబంధిత
పాఠశాల లాగిన్ ద్వారా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ
వరకు ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. గుర్తింపు ముగిసిన ప్రైవేటు పాఠశాలల వివరాలను www.bse.ap.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు.
District wise Schools Blocked due to the Renewal Recognition Pending for JUNE 2021 👇
0 Komentar