Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mana Badi Nadu -Nedu Phase II Guidelines for Implementation of the Programme

 

Mana Badi Nadu -Nedu Phase II Guidelines for Implementation of the Programme

మన బడి - నాడు నేడు రెండవ దశ అమలుకు మార్గదర్శకాలు విడుదల

నాడు-నేడు రెండో దశ పనులకు పాలనాపరమైన అనుమతి

16,345 విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో పనులు

రాష్ట్రవ్యాప్తంగా 16,345 విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో రెండో విడత ‘నాడు-నేడు’ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠశాలలకు విద్యాశాఖ పరిపాలన అనుమతులతో పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ పనులను విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు నిర్వహిస్తాయి. ఎక్కడైనా ఈ కమిటీలు పనులు చేయలేకపోతే అక్కడ టెండర్లు పిలుస్తారు. పనులకు ముందుగా 15% రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేలా ప్రారంభించిన మనబడి నాడు- నేడు పనుల రెండో దశకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండో దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 345 విద్యాసంస్థల్లో పది రకాల సదుపాయాలు కల్పించనున్నారు. అందుకోసం రూ. 4 వేల 446 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ జీవో జారీ చేశారు. వీటిలో 12 వేల 678 పాఠశాలలు, 1668 ప్రభుత్వ హాసళ్లు, 473 జూనియర్ కళాశాలలు, 17 డైట్, సీటీఈ ఐఏఎస్ఈ కళాశాలలు ఉన్నాయి.      

పనులు చేపట్టేందుకు 28 మంది అధికారులతో ప్రత్యేకంగా సాంకేతిక సహాయ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థలో ఉన్న విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా, సంచాలకులు కన్వీనర్‌గా 19మందితో రాష్ట్రస్థాయి కమిటీ ఉంటుంది. 250 మందికి పైగా విద్యార్థులుంటే అర్కిటెక్ట్‌తో ప్రణాళిక రూపొందిస్తారు. నాబార్డు, ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులను వినియోగించనున్నారు. 10% మండలాల్లో నమూనాగా ఆడిట్‌ నిర్వహిస్తారు. 

School Education - Mana Badi Nadu -Nedu Phase II – Administrative approval for implementation of Mana Badi Nadu-Nedu Phase-II to improve Infrastructure facilities in 16,345 educational institutions with (10) components in the State for the FY 2021-22 with an amount of Rs.4,446 crores and guidelines for implementation of the Programme - Accorded- Orders – Issued.

G.O.MS.No. 27 Dated: 30-03-2021.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags