MES Recruitment 2021: Apply for 502 Draughtsman and Supervisor Barrack Store Vacancies
ఇండియన్ ఆర్మీ-ఎంఈఎస్ లో 502 ఖాళీలు
ఇండియన్ ఆర్మీ-మిలిటరీ ఇంజినీర్
సర్వీసెస్(ఎంఈఎస్)కి చెందిన పుణెలోని సదరన్ కమాండ్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 502
1) డ్రాఫ్ట్ మెన్: 52
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ
నుంచి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్స్ షిప్ లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత
పనుల్లో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
2) సూపర్వైజర్ (బారక్స్ అండ్
స్టోర్స్): 450
అర్హత: ఎకనమిక్స్/ కామర్స్/
స్టాటిస్టిక్స్/ బిజినెస్ స్టడీస్/ పబ్లిక్ అడ్మినిస్టేషన్ సబ్జెక్టుల్లో
బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం
ఉండాలి. వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష 125
మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా
సమయం 120 నిమిషాలు ఉంటుంది. కింద సూచించిన విధంగా వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు, మార్కులు
ఉంటాయి.
* జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్
- 25 ప్రశ్నలు - 25 మార్కులు
* జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్
ఇంగ్లిష్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
* న్యూమరికల్ ఆప్టిట్యూడ్ - 25
ప్రశ్నలు - 25 మార్కులు
* స్పెషలైజ్డ్ టాపిక్ - 25
ప్రశ్నలు - 50 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100
చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: సికింద్రాబాద్, వైజాగ్.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.03.2021.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
12.04.2021.
* పరీక్ష తేది: 16.05.2021.
0 Komentar