Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MiG-21 Crashes in Central India, Pilot Killed, Says Indian Air Force

 

MiG-21 Crashes in Central India, Pilot Killed, Says Indian Air Force

కుప్పకూలిన మిగ్‌ 21 యుద్ధ విమానం

భారతీయ వాయుసేనకు చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. గ్వాలియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్‌ ఎ.గుప్తా మృతి చెందారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారికంగా ప్రకటించింది. దీనిపై వాయుసేన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీని ప్రారంభించింది.

గత 18 నెలల్లో మిగ్‌-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్లో ఇదే ఎయిర్‌ బేస్‌లో మిగ్‌21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో భారత్‌ విమానాలను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్‌ పైలట్లను కూడా కోల్పోతోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags