NEET 2021: NTA Announces Exam Date,
Check Details
ఆగస్ట్ 1న నీట్-2021 – తెలుగులో కూడా NEET పరీక్ష
నీట్ యూజీ-2021 పరీక్షను ఆగస్టు 1న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సులను నియంత్రించే సంస్థలు జారీచేసిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనున్నారు.
హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 11 భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో నిర్వహించే ఈ
పరీక్ష ఫలితాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇతర సంస్థలు (ఇండియన్
నర్సింగ్ కౌన్సిల్/నర్సింగ్ కాలేజీలు/స్కూళ్లు, జిప్‌మర్)
అవసరమైన కోర్సుల కౌన్సెలింగ్/అడ్మిషన్ల కోసం (బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌తోసహా) ఉపయోగించుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
పరీక్షకు సంబంధించిన సిలబస్, అర్హత ప్రమాణాలు, వయసు, రిజర్వేషన్, సీట్ల
వర్గీకరణ, పరీక్ష ఫీజు, నిర్వహించే
కేంద్రాలు, స్టేట్ కోడ్, ఎప్పటిలోపు
దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని వివరాలను
త్వరలో ఎన్‌టీఏనీట్ వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. నీట్‌కు
హాజరుకావాలనుకొనే విద్యార్థులంతా nta.ac.in, ntaneet.nic.in వెబ్‌సైట్లను
గమనిస్తూ ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
0 Komentar