Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET UG 2021 Date to Be Out Soon, Exam to Be Held Only Once in A Year

 

NEET UG 2021 Date to Be Out Soon, Exam to Be Held Only Once in A Year

నీట్‌ ఒక్కసారే - ఈ వారంలో తేదీని ప్రకటించనున్న ఎన్‌టీఏ 

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌-2021ను ఒక్కసారే నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షను రెండుసార్లు జరపాలని విద్యార్థుల నుంచి కేంద్ర విద్యాశాఖకు భారీ సంఖ్యలో వినతులు అందాయి. ఫలితంగా రెండుసార్లు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరుతూ జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) జనవరిలో కేంద్ర వైద్యశాఖకు లేఖ రాసింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో కచ్చితంగా రెండుసార్లు జరుపుతారని భావించారు. అయితే తాజాగా పరీక్షను ఒక్కసారే జరపాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఈ వారంలో పరీక్ష తేదీని వెల్లడిస్తామని చెప్పారు. రెండుసార్లు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags