NIMCET-2021 NIT MCA Common Entrance Test
2021 Notification Released
నిమ్ సెట్-2021: నోటిఫికేషన్ విడుదల
నిమ్ సెట్-2021: ఈ పరీక్షలో అర్హత సాధిస్తే దేశంలోని 11 ఎన్‌ఐటి లలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చేయవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత నిట్ లో ప్రవేశించలేకపోయిన వారూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం నిమ్ సెట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ లేదా ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కల నెరవేరాలన్నా కోరుకున్న సంస్థలో సీటు రావాలన్నా ఈ ప్రవేశ పరీక్షకు సరైన ప్రణాళికతో సిద్ధం కావాలి.
అర్హత: నిమ్ సెట్-2021 పరీక్షకు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో మూడేళ్ల ఫుల్ టైం బీఎస్సీ/
బీఎస్సీ(హానర్స్)/ బీసీఏ/ బిట్ బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ (కంప్యూటర్ సైన్స్/
కంప్యూటర్ అప్లికేషన్స్)/ బీబీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీఈ/ బీటెక్
ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: అర్హులైన
అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గడువు ఏప్రిల్ 7, 2021
వరకు ఉంది. పరీక్ష రుసుము రూ.2,500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ
అభ్యర్థులు రూ.1250 చెల్లిస్తే సరిపోతుంది.
ప్రవేశ పరీక్ష విధానం: ఈ ఉమ్మడి
ప్రవేశ పరీక్షను మే 23, 2021 ఆదివారం ఆన్లైన్ విధానంలో
నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో మ్యాథమేటిక్స్ (50 ప్రశ్నలు),
అనలైటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు), కంప్యూటర్ అవేర్ నెస్ (10 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్
నుంచి 20 ప్రశ్నల చొప్పున వస్తాయి. సమయం రెండు గంటలు ఇస్తారు. ప్రశ్నలు మల్టిపుల్
చాయిస్ రూపంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి సరైన
సమాధానానికి 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత
విధిస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2021
0 Komentar