NIOS Admissions 2021-22: Admissions for Classes
10 And 12
ఎన్‌ఐఓఎస్‌లో 10, 12వ తరగతి అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల
NIOS Admission 2021 for 10th and 12th: నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో 10 లేదా 12వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు
ఆన్‌లైన్‌లో https://sdmis.nios.ac.in/ లో నమోదు
చేసుకోవచ్చు.
NIOS ప్రవేశాల కోసం
నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 1
నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 సంవత్సరానికి గానూ సెకండరీ మరియు సీనియర్ సెకండరీ కోర్సుల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.
నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో 10 లేదా 12వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో https://sdmis.nios.ac.in/ లో నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలు 2022 ఏప్రిల్ నెలలో జరుగుతాయి.
అర్హతలు:
1. సెకండరీ క్లాస్
అడ్మిషన్ల కోసం:
సెకండరీ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థి కనీస వయస్సు 2021 జనవరి 31 నాటికి 14 సంవత్సరాలు (31-01-2006 న లేదా అంతకు ముందు జన్మించినవారు) ఉండాలి. విద్యార్థులు 8 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు 14 ఏళ్లు నిండినట్లు బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతులున్న వారు సెకండరీ కోర్సులో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2. సీనియర్ సెకండరీ క్లాస్
అడ్మిషన్ల కోసం:
సీనియర్ సెకండరీ కోర్సులో ప్రవేశానికి విద్యార్థి కనీస వయస్సు 2021 జనవరి 31 నాటికి 15 సంవత్సరాలు (31-01-2005 నాటికి లేదా అంతకు ముందు జన్మించిన వారు) ఉండాలి. సీనియర్ సెకండరీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఆ విద్యార్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి సెకండరీ కోర్సులో ఉత్తీర్ణుడై ఉండాలి.
ఇలా అప్లయ్ చేసుకోండి:
మొదట అధికారిక వెబ్‌సైట్ https://sdmis.nios.ac.in/
ఓపెన్ చేయాలి
తర్వాత ‘రిజిస్టర్’ టాబ్ పై క్లిక్
చేయాలి
విద్యార్థి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
దరఖాస్తు ఫారమ్ నింపాలి
ఆధార్ నంబర్ లేదా ఏదైనా ప్రభుత్వ
ఐడి ప్రూఫ్ ఇచ్చి విద్యార్థి ఐడిని ధృవీకరించాలి
విషయాలను ఎంచుకోవాలి
OTP ను రూపొందించి
కొనసాంచాలి
దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
0 Komentar