NTA DU Recruitment 2021 Apply For 1145
Non-Teaching Posts - Jr Assistant, Assistant, Steno, JE and Other Posts
ఈ నోటిఫికేషన్ ద్వారా 1145 పోస్టుల్ని భర్తీ చేయనుంది.
దరఖాస్తుకు మార్చి 16
ఆఖరు తేది
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి
మార్చి 17 చివరి తేదీ.
ఎన్‌టీఏ నాన్ టీచింగ్ పోస్టులు
ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1145 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 16 దరఖాస్తులకు చివరి తేదీ. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/ లేదా ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://www.du.ac.in/ పూర్తి వివరాలు చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: పోస్టులను బట్టి
వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వేర్వేరు
పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
వయస్సు: పోస్టులను బట్టి 27-45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనాలిటీ
టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, అన్‌రిజర్వ్‌డ్
అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్,
మహిళా అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 23, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2021
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి
చివరి తేదీ: మార్చి 17, 2021
దరఖాస్తులో తప్పులు
సరిదిద్దుకోవడానికి: మార్చి 18 నుంచి 20 వరకు.
0 Komentar