Productions Executive Posts – 800 Jobs
at Rising Stars Mobiles India Private Limited
ఏపీఎస్‌ఎస్‌డీసీ జాబ్ రిక్రూట్‌మెంట్
డ్రైవ్
రైజింగ్ స్టార్ మెబైల్స్‌లో 800 ఉద్యోగాల భర్తీ
మార్చి 31న
స్కిల్ కనెక్ట్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్ (APSSDC) జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం మార్చి 31వ తేదీన విజయవాడలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
నెల్లూరు జిల్లా శ్రీసిటీలోని
సంస్థలో జింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 800 పోస్టుల్ని భర్తీ చేయడం కోసం APSSDC సహకారం
తీసుకుంటోంది.
ప్రొడక్ట్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో
ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం
ఉన్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థుల వయస్సు 18
నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం అమ్మాయిలు మాత్రమే ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,120
వేతనం ఉంటుంది. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉచిత
భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు
కల్పిస్తారు.
రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరిగే
వేదిక: అఖినవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 40-27-88/1, లోహియా టవర్స్, నిర్మలా కాన్వెంట్ ఎదురుగా, పటమట, విజయవాడ, సీఆర్‌డీఏ
రీజియన్.
ఆసక్తి గల అభ్యర్థులు 2021 మార్చి 31 ఉదయం 10 గంటలకు
రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్ (APSSDC) అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/
లో తెలుసుకోవచ్చు.
@AP_Skill Now Hiring For #Dhruvanthsolutions pic.twitter.com/thRZISQ4ex
— AP Skill Development (@AP_Skill) March 23, 2021
0 Komentar