సి.పి.యస్ గురించి సందేహాలూ – సమాధానాలు
🤔 ప్రశ్న: సి.పి.యస్ ఉద్యోగులకు ఫ్యామిలీ
పెన్షన్ ఓ.పి.యస్ వారికి లాగానే ఉంటుందా?
👉 జవాబు: లేదు. వేరు వేరుగా ఉంటుంది.
🤔 ప్రశ్న: ఫ్యామిలీ పెన్షన్ ఎలా వేరు?
👉 జవాబు:: పాత పెన్షన్ లో G.P.F ఖాతా లోని సొమ్ము ను
ఉద్యోగి తీసుకుంటారు. కానీ సి.పి.యస్ ఖాతా లోని సొమ్ము చనిపోయిన ఉద్యోగి ప్రభుత్వం
కు ఇస్తేనే కుటుంబ పెన్షన్ ఇస్తేనే 1980 రూల్స్ వర్తిస్తాయనే
నిబంధన కు లోబడితేనే కుటుంబ పెన్షన్ అమలు అవుతుంది.
🤔 ప్రశ్న: ఇపుడు చనిపోయిన సి.పి.యస్
ఉద్యోగులకు లాభమేనా?
👉 జవాబు: మరణించిన సి.పి.యస్ ఉద్యోగి యొక్క
సర్వీస్ తక్కువ ఉంటే అతని ఖాతాలో సొమ్ము ను పూర్తి గా ప్రభుత్వం కు ఇవ్వాలనే
నిబంధన లేకపోతే (GPF ఇలా లేదు.) అతని కుటుంబానికి ఆ సొమ్ము తో
పాటు కుటుంబ పెన్షన్ వస్తే ఇంకామేలు జరిగేది. ఇక్కడ ఉద్యోగి జీతం నుండి మినహాయింపు
చేసిన సొమ్ము తో పాటు ప్రభుత్వం వాటాను కొల్పోవలసి ఉంటుంది.
🤔 ప్రశ్న: ఉద్యోగి రిటైర్ అయిన తరువాత
మరణిస్తే కుటుంబ పెన్షన్ వర్తిస్తుందా?
👉 జవాబు: వర్తించదు. విధి నిర్వహణలో ఉండి
మరణించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. రిటైర్ అయిన ఉద్యోగి 60% విత్డ్రా చేసుకుంటారు, 40% అన్యునుటీ లో ఉండి
పెన్షన్ పొందుతారు. ఇది 2 లక్ష లకు లోపు ఉంటే పూర్తి గా విత్
డ్రా చేసుకోవలెను.
🤔 ప్రశ్న: సి.పి.యస్ ఉద్యోగులకు ఫ్యామిలీ
పెన్షన్ తో కలిగే లాభం ఏంటి?
👉 జవాబు: ఇపుడు ఈ అంశం చాలా
విచిత్రమైంది.సి.పి.యస్ ఉద్యోగి ఖాతా లో సొమ్ము ఎక్కువ ఉన్న వారికి నష్టం.ఆ సొమ్ము
మొత్తం ఆ కుటుంబం కోల్పోతే కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది. తక్కువ ఉంటే ఆ కుటుంబం కు
భరోసా ఉంటుంది.అయినా ఖాతా సొమ్ము మాత్రం కోల్పోవలసిందే.
🤔 ప్రశ్న: మరి ఇది విజయమా? అసలు
ఏది బెటర్?
👉 జవాబు: సి.పి.యస్ ఉద్యోగులకు ఈ పెన్షన్
తో పాటు ఆ ఖాతా లోని సొమ్ము ఇస్తే మరికకొంత భద్రత చేకూరుతుంది. ఈ కుటుంబ పెన్షన్
విధానం GPF
వారికి లాగానే ఉంటే కొంత విజయం అని చెప్పవచ్చు.
0 Komentar