RailTel Launches Prepaid Wi-Fi Service
At 4,000 Railway Stations
రైల్వే ప్రయాణికులకు హైస్పీడ్ వైఫై సర్వీసులు అందుబాటులోకి - రూ.70తో నెలంతా హైస్పీడ్ నెట్!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.
దేశవ్యాప్తంగా 4 వేల స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సర్వీసులు అందుబాటులోకి
వచ్చాయి. అలాగే ప్రిపెయిడ్ ప్లాన్స్ కూడా లాంచ్ చేశారు. రూ.70తో నెలంతా డేటా పొందొచ్చు.
దేశవ్యాప్తంగా 4
వేల రైల్వే స్టేషన్లలో ఈ వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా హైస్పీడ్
ప్రిపెయిడ్ ప్లాన్స్ కూడా లాంచ్ చేసింది. రోజులో తొలి 30
నిమిషాలు ఉచితంగానే వైఫై పొందొచ్చు. అది హైస్పీడ్ ఇంటర్‌నెట్ వస్తుంది. 1 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ లిభిస్తుంది.
ఇలా తొలి 30 నిమిషాల తర్వాత నచ్చిన ప్రిపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. రూ.10 పెడితే రోజుకు రూ.5 జీబీ డేటా వస్తుంది. రూ.15 పెడితే రోజుకు రూ.10 జీడీ డేటా లభిస్తుంది. రూ.20కు 10 జీబీ డేటా వస్తుంది. ఐదు రోజులు వాడుకోవచ్చు. రూ.30 పెడితే 20 జీబీ డేటా వస్తుంది. వాలిడిటీ 5 రోజులు.
అలాగే రూ.40 పెడితే 20 జీబీ డేటా వస్తుంది. వాలిడిటీ 10 రోజులు ఉంటుంది. రూ.50కు 30 జీబీ
డేటా వస్తుంది. వాలిడిటీ 10 రోజులు. అలాగే రూ.70కు 60 జీబీ డేటా లభిస్తుంది. వాలిడిటీ 30 రోజులు. అంటే రూ.70 పెడితే నెలంతా డేటా పొందొచ్చు.
రోజుకు 2 జీబీ వస్తున్నట్లు అవుతుంది.
0 Komentar