SBI: Check Interest Rates for Home, Car,
Personal, Overseas Education, Gold Loans
ఎస్‌బీఐ రుణ గ్రహీతలకు చౌక
వడ్డీకే రుణాలు – వివరాలు ఇవే
స్టేట్ బ్యాంక్ చౌక వడ్డీకే రుణాలు
ఆఫర్ చేస్తోంది. దీంతో మీరు ఏ రుణం తీసుకోవాలన్నా ఎస్‌బీఐకి వెళ్లొచ్చు. మీ అర్హత
ప్రాతిపదికన రుణం లభిస్తుంది.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. పర్సనల్
లోన్ దగ్గరి నుంచి హోమ్ లోన్ వరకు మీకు అవసరమైన రుణం పొందొచ్చు. లోన్ తీసుకోవాలని
భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.
స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా
ఈ విషయాన్ని వెల్లడించింది. రుణం తీసుకోవాలని భావించే వారు యోనో ప్లాట్‌ఫామ్
ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అందిస్తున్న రుణాలపై వడ్డీ
రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే..
వడ్డీ రేటు 6.7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కారు లోన్ పొందాలని
యోచిస్తే 7.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. బంగారంపై లోన్
పొందాలని యోచిస్తే వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఎడ్యుకేషన్
లోన్‌పై 9.3 శాతం వడ్డీ పడుతుంది.
ఇకపోతే ఎస్‌బీఐ కొంత మంది కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ఈ తరహా పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటు పడుతుంది. ఇకపోతే సిబిల్ స్కోర్ ప్రాతిపదికన మీరు పొందే రుణంపై వడ్డీ రేటు మారొచ్చు. హోమ్ లోన్‌కు ఇది ప్రధానంగా వర్తిస్తుంది.
एसबीआई आपकी ऋण आवश्यकताओं को पूरा करने के लिए यहां है, ताकि आप जीवन के हर पडा़व का आनंद ले सकते हैं ।
— State Bank of India (@TheOfficialSBI) March 27, 2021
आवेदन करने के लिए यहां जाएं: - https://t.co/BwaxSaM77i
#PehleSBI #PersonalLoan #PreApprovedPersonalLoan #HomeLoan #CarLoan #GoldLoan #EducationLoan pic.twitter.com/63T6M6LU4o
0 Komentar