SBI Cuts Home Loan Interest Rate To
6.7%, Processing Fee Waiver to Continue
గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ - వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గింపు
గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్
చెప్పింది. హోమ్ లోన్‌పై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు
తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 6.70 శాతం నుంచి వడ్డీ
రేట్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. రుణ మొత్తం, సిబిల్
స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. మార్చి నెలాఖరు వరకే ఈ
సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
₹75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం వడ్డీకే రుణాలు అందిస్తామని, ₹75 లక్షల నుంచి ₹5 కోట్ల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ
వర్తిస్తుందని పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజుపైనా నూరు శాతం రాయితీ అందిస్తున్నట్లు
ఎస్‌బీఐ ప్రకటించింది. అదేవిధంగా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ తీసుకుంటే
మరో 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీ ఇస్తున్నట్లు
ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ
గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని
అందిస్తున్నట్లు పేర్కొంది.
0 Komentar