SBI Multi-Option Deposit Scheme:
Benefits and Other Details That You Need to Know
ఎస్‌బీఐ మల్టీ-ఆప్షన్ డిపాజిట్
ఖాతా వివరాలు
ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్
స్కీమ్ (ఎంఓడీఎస్) అనేది వ్యక్తుల పొదుపు లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానించబడిన
టర్మ్ డిపాజిట్లు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలా కాకుండా, మీకు డబ్బు
అవసరమైనప్పుడు ఖాతా నుంచి, రూ.1,000
గుణిజాలలో ఉపసంహరించుకోవచ్చు. మీ ఖాతాలోని బ్యాలెన్స్‌ఫై ప్రారంభ డిపాజిట్ సమయంలో
వర్తించే డిపాజిట్ రేట్లు లభించడం కొనసాగుతుంది.
ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్
స్కీమ్ గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి:
1)ఈ ఎస్‌బీఐ మల్టీ-ఆప్షన్
డిపాజిట్ ఖాతాను ప్రారంభించడానికి అవసరమైన కనీస టర్మ్ డిపాజిట్ మొత్తం రూ. 10,000.
2)
గరిష్ట టర్మ్ డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు.
3) ఈ ఖాతాలో వడ్డీ రేటు
టర్మ్ డిపాజిట్లపై వర్తించే విధంగా ఉంటుంది. సాధారణ వినియోగదారులకు ఎస్‌బీఐ ఎఫ్‌డీ
వడ్డీ రేట్లు 2.9 శాతం నుంచి 5.4 శాతం
మధ్య ఉంటాయి. ఈ రేట్లు 20 జనవరి 2021
నుంచి అమలులోకి వచ్చాయి.
4) ఖాతాకు వర్తించే కనీస గడువు
ఒక సంవత్సరం, గరిష్టంగా 5
సంవత్సరాలు.
5) ముందస్తు ఉపసంహరణకు
వీలుంటుంది. రూ. 5 లక్షల వరకు ఎఫ్‌డీలకు, ముందస్తు ఉపసంహరణకు జరిమానా 0.50 శాతం. రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల లోపు ఉన్న ఎఫ్‌డీలకు, వర్తించే
జరిమానా 1 శాతం. ఖాతా యాక్టివ్‌గా లేనప్పుడు ఆ కాలానికి
వర్తించే రేటు వద్ద వడ్డీని జరిమానాతో కలిపి చెల్లించాలి. మిగిలిన మొత్తం అసలు
వడ్డీ రేటును సంపాదిస్తూనే ఉంటుంది. 7 రోజుల కన్నా తక్కువ
వ్యవధిలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ చెల్లింపు ఉండదు.
6)
ఒకరు లేదా ఉమ్మడిగా, మైనర్ (స్వయంగా /
ఆమె లేదా అతని / ఆమె సంరక్షకుడి ద్వారా), హెచ్‌యూఎఫ్,
స్థానిక సంస్థలు, ఏదైనా ప్రభుత్వ విభాగం ఎస్‌బీఐ
మల్టీ ఆప్షన్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు.
7) ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్
డిపాజిట్ పథకానికి టీడీఎస్ వర్తిస్తుంది.
8) ఈ ఖాతాపై రుణ సౌకర్యం
కూడా ఉంది.
9) నామినేషన్ సౌకర్యం
అందుబాటులో ఉంది
10) మీరు ఆన్‌లైన్ ఎస్‌బీఐ
ద్వారా లేదా మీ సమీప శాఖను సందర్శించడం ద్వారా
ఖాతాను ప్రారంభించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎస్‌బిఐ మల్టీ ఆప్షన్
డిపాజిట్ ఖాతాను ఎలా ప్రారంభించాలి?
1) ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐకి
లాగిన్ అవ్వండి.
2) ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై
క్లిక్ చేయండి
3) ఇక్కడ ఇ-టిడిఆర్ / ఇ-ఎస్టిడిఆర్ (ఎఫ్‌డీ)
కినిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
4) అక్కడ ఇ-టిడిఆర్ /
ఇ-ఎస్టిడిఆర్ (ఎంఓడి) మల్టీ ఆప్షన్ డిపాజిట్ ఎంచుకుని కొనసాగండి.
5) మీ డెబిట్ ఖాతా నంబర్‌ను
ఎంచుకోండి, మల్టీ-ఆప్షన్ డిపాజిట్ మొత్తాన్ని నమోదు
చేయండి, టీడీఆర్ లేదా ఎస్‌టీడీఆర్ వంటి డిపాజిట్ ఆప్షన్లను
ఎంచుకోండి, కాలపరిమితి నమోదు చేసి సమర్పించండి.
6) ఖాతా ప్రారంభ అభ్యర్థనను
నిర్ధారించండి.
0 Komentar