Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Simple Steps to Help You from Stress and Anxiety

 

Simple Steps to Help You from Stress and Anxiety

ఈ పద్ధతులు పాటిస్తే ఒత్తిడి దూరమవుతుంది - మార్పుకి తగినట్లుగా జీవనశైలి మార్చుకోవడం ఎలా? 

ఎలాంటి ఆందోళన లేకుండా గడిచే రోజులని వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు మనం. ఆఫీసులో పనో, పిల్లల స్కూలు విషయాలో, ఇంట్లో సంగతులో, ఆర్ధిక పరమైన ఇబ్బందులో, బంధువుల వ్యవహారాలో.. ఏవో ఒకటి మనని ఒత్తిడికి గురి చేస్తూనే ఉన్నాయి.

ఒత్తిడి రెగ్యులర్ గా ఉంటే డయాబెటీస్ నుండీ గుండె జబ్బుల వరకూ, తలనొప్పి నుండీ అల్జైమర్స్ వరకూ ఎన్నో వ్యాధులు దాడి చేయడానికి రెడీగా ఉంటాయి. అలాగని ఆఫీసుకి వెళ్ళకుండా ఉండలేం. బంధువులకి దూరంగా మసలలేం.. అలాంటివేవీ కుదరవు. ఒత్తిడి కలిగించే పరిస్థితులకి దూరంగా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు, కాబట్టి ఒత్తిడికి మనం రెస్పాండ్ అయ్యే పద్ధతి మార్చుకోవాలి, ఆ మార్పుకి తగినట్లుగా మన జీవనశైలి ఉండాలి. మరి, ఆ పద్ధతులేమిటో చూద్దామా.. 

1. రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్

ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవాలంటే ఉన్న ప్రధాన మార్గాలలో ఎక్సర్‌సైజ్ కూడా ఒకటి. వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైతే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అవుతాయి. నిద్ర బాగా పడుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీకు నచ్చే ఎక్సర్సైజ్ రొటీన్ ఎంచుకోండి, రెగ్యులర్ గా చేయండి.

2. ఎసెన్షియల్ ఆయిల్స్

ఎసెన్షియల్ ఆయిల్స్ వాడడం, లేదా సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ రెడ్యూస్ అవుతాయి. ప్రత్యేకించి కొన్ని సెంట్స్ మనసుకి రిలాక్సింగ్ గా అనిపిస్తాయి. అవి, లావెండర్, రోజ్, వెటివర్, నెరోలీ, శాండల్‌వుడ్, జెరేనియం, ఆరెంజ్ వంటివి ఇందుకు బాగా పనికొస్తాయి. ఇలా మూడ్ బాగుండడానికి సెంట్స్ వాడడాన్ని అరోమా థెరపీ అంటారు. 

3. కాఫీ తక్కువగా

కాఫీ, టీ, చాకొలేట్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫీన్ అనే స్టిమ్యులెంట్ ఉంటుంది. ఇవి ఎక్కువైతే యాంగ్జైటీ కూడా పెరుగుతుంది. అయితే, ఎవరు ఎంత కెఫీన్ టాలరేట్ చేయగలరన్నది వ్యక్తిని బట్టి మారుతుంది. సుమారుగా, రోజుకి నాలుగైదు కప్పుల కంటే తక్కువ కాఫీ తీసుకోవడం మంచిది. 

4. ఒక చోట రాయండి.

స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడానికి ఒక పద్ధతి ఏమిటంటే ఒక డైరీలో మీరెందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో రాయటం. దాంతో పాటూ మీరు మీ జీవితంలో వేటి వేటికి కృతజ్ఞతతో ఉంటున్నారో కూడా రాయండి. కృతజ్ఞత వల్ల ఆందోళన తగ్గుతుంది. మీ లైఫ్ లో పాజిటివ్ గా ఉన్న విషయాల మీద ఫోకస్ చేయడానికి మీకు వీలు కుదురుతుంది.

5. నవ్వుతూ ఉండండి.

నవ్వుతూ ఆందోళనగా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు, ఒకటే చేయగలం. కాబట్టి, నవ్వుతూ ఉంటే ఆందోళన తగ్గించుకోగలం. పైగా, ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. నవ్వొచ్చే టీవీ షో చూడడం కానీ, సరదాగా ఫ్రెండ్స్ తో సమయం గడపడం కానీ చేస్తూ ఉంటే మీకూ రిలాక్సింగ్ గా ఉంటుంది.

6. నో చెప్పడం నేర్చుకోండి

ఒత్తిడి కలిగించే ప్రతి విషయానికీ మనం నో చెప్పలేం కానీ, కొన్నింటికి చెప్పే వీలుందేమో చెక్ చేసుకోండి. అలాగే, మీ లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొన్ని పరిస్థితులని ఎవాయిడ్ చేయగలరేమో కూడా చెక్ చేసుకోండి. మీ వల్ల కాని పని చేయడానికి ఎప్పుడూ కమిట్ అవ్వకండి.

7. పోస్ట్‌పోన్ చేయకండి

మీ ప్రాముఖ్యతలని అర్ధం చేసుకుని పోస్ట్‌పోన్ చేయకుండా పనులు చేసుకోవడం కూడా స్ట్రెస్ ని మ్యానేజ్ చేసే పద్ధతుల్లో ఒకటి. ఇవాళ ఒక పనే వాయిదా వేస్తాం కానీ, వారాంతానికి అన్నీ కలిపి చాలా పనులయిపోతాయి, అన్ని పనులు అర్జెంట్ అయిపోతాయి. ఆటోమ్యాటిక్ గా ఒత్తిడి ఫీల్ అవుతాం. దీని వల్ల మీ నిద్రే కాక మీ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. ఒక లిస్ట్ రాసుకుని ఆ ప్రయారిటీల ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకూ హాయిగా ఉంటుంది. అంతే కాక, మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని గుర్తుంచుకోండి.

8. సంగీతం వినండి

రిలాక్సింగ్ గా ఉండే మ్యూజిక్ వినడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా వినిపించే సంగీతం హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ హార్మోన్స్ ని తగ్గిస్తుంది. మీకు నచ్చే మ్యూజిక్ వినడానికి సమయం కేటాయించుకోండి.

9. కొంచెం స్లోగా

ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితం చాలా హడావిడితో కూడుకున్నది. అప్పుడప్పుడూ కొంచెం నెమ్మదిగా పనులు చేసుకోవటం మీరు ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలనిస్తుంది.

10. హాబీలు. 

మీకు నచ్చే కొన్ని హాబీలు డెవలప్ చేసుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి. పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం, పజిల్స్ చేయడం, బోర్డ్ గేమ్స్ ఆడడం.. ఏదైనా సరే, ఇది మీ లైఫ్ కి ఊహించని పరిమళాన్ని అద్దుతుంది.

11. సమతులాహారం తీసుకోండి.

బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్.. ఇవి రెగ్యులర్ గా టైమ్ ప్రకారం అయిపోయేటట్లు చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి, శరీరం, మనసూ కూడా దృఢంగా ఉంటాయి. అప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సమస్యని ఎదుర్కొనే శక్తీ, ధైర్యం వస్తాయి.

12. డీప్ బ్రీదింగ్.

గాఢంగా ఊపిరి పీల్చి వదలడం వల్ల మీకు తక్షణం ఒత్తిడి నుండి రిలీఫ్ లభిస్తుంది. కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి, లేదా పడుకోండి. కళ్ళు మూసుకోండి. ఏదైనా రిలాక్సింగ్ ప్లేస్ లో ఉన్నట్టు ఊహించుకోండి. నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలండి. ఐదు పది నిమిషాలు ఇలా చేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags