5 వేల మంది టీచర్ల (హెచ్.ఎం, ఎస్‌ఏలకు) బదిలీ ఉత్తర్వుల
విడుదలకు విద్యాశాఖ సిద్ధం
కోర్టు కేసుల కారణంగా గత
కొంతకాలంగా బదిలీకి నోచుకోని దాదాపు 5 వేల మంది ఉపాధ్యాయుల
సమస్యకు తెరపడనుంది. కౌన్సెలింగ్‌లో వారు కోరుకున్న పాఠశాలకు బదిలీ అయ్యేందుకు
మార్గం సుగమమైంది. బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసేందుకు పాఠశాల
విద్యాశాఖ సిద్దమవుతోంది. వీరిలో ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్-2), స్కూల్ అసిస్టెంట్లు(తెలుగు, హిందీ) మాత్రమే
ఉన్నారు. కౌన్సెలింగ్‌లో ప్రమోషన్ ఖాళీలను చూపించాలని కొందరు టీచర్లు కోర్టుకు
వెళ్లగా స్టే ఇచ్చింది. తర్వాత ఆ కేసు పరిష్కారమైంది.
కానీ, వెంటనే
స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల (లాంగ్వేజెస్) బదిలీ నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికల
కోడ్ తొలగిపోవడంతో బదిలీ ఉత్తర్వులకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. బదిలీ
అయ్యే టీచర్ల జాబితా పరిశీలన ప్రక్రియ మంగళవారం పూర్తయింది.
0 Komentar