నేడు, రేపు
బ్యాంకు ఉద్యోగుల సమ్మె -
ప్రభుత్వరంగ బ్యాంకుల
ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ)
దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో సోమ, మంగళవారాల్లో (March 15, 16) బ్యాంకు
సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది. పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఫోరం తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖ
మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో బడ్జెట్ సమర్పణ సందర్భంగా పెట్టుబడుల ఉపసంహరణ
కార్యక్రమంలో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటుపరం చేస్తున్నట్టు
ప్రకటించిన విషయం తెలిసిందే. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మార్చి 4,
9, 10 తేదీల్లో జరిగిన రాజీ చర్చలు సానుకూల
ఫలితం ఇవ్వకపోవడంతో సమ్మె అనివార్యంగా మారినట్టు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం
ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు.
0 Komentar