టిఎస్: 29% ఫిట్ మెంట్ - పదవీ
విరమణ వయసు పెంపు - మార్చి నెలాఖరు నుంచే అమలు
ప్రభుత్వోద్యోగులతోపాటు టీచర్లకూ
వర్తింపు
ఉద్యోగ, ఉపాధ్యాయులకు
ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అమల్లో ఉందని, తెలంగాణలో దానికన్నా రెండు శాతం అధికంగానే ఫిట్‌మెంట్ (వేతన సవరణ) అమలు
చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వేతన సవరణ కమిషన్
సిఫారసుతో సంబంధం లేకుండానే ఫిట్‌మెంట్ ఉండనుందని సంకేతాలు ఇచ్చారు. ఉద్యోగ,
ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్‌మెంట్ అమలు కోసం కమిషన్ సిఫారసు చేసిన
విషయం తెలిసిందే. దీనిపై సంఘాలన్నీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. గత
ఏడాది డిసెంబరులోనే వేతన సవరణ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించగా.. ఆ
తర్వాత తొలిసారిగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్
అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి
సాయంత్రం 6:30 గంటల వరకూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగ,
ఉపాధ్యాయుల్లో నిరాశను నింపిందని, ఏపీలో
మధ్యంతర భృతి 27 శాతం ఇస్తున్నారని, దానికన్నా ఎక్కువే ఫిట్‌మెంట్
ఉండాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు
29% ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలిసింది. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును
ప్రస్తుతం ఉన్న 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు (మూడేండ్లు) పెంచనున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున.. కోడ్ ముగిసిన
వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇస్తారని విశ్వసనీయ
వర్గాలు నమస్తే తెలంగాణకు తెలియజేశాయి. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్
సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
పీఆర్సీ ప్రకటనచేస్తారని తెలుస్తున్నది. ఈ నెలాఖరునుంచి రిటైర్మెంట్ వయసు పెంపు
వర్తించేలా చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు ఇటీవల
ప్రకటించిన 27% ఐఆర్ కంటే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువగానే ఇవ్వాలని ముఖ్యమంత్రి
భావిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
మార్చి నుంచే రిటైర్మెంట్ వయసు
పెంపు
రిటైర్మెంట్ వయసు 58 ఏండ్ల నుంచి
61 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. మార్చి చివరినాటికి
కొందరు ఉద్యోగులు రిటైర్ అవుతారు కాబట్టి.. పదవీ విరమణ వయసు పెంపు వారికీ
వర్తించేలా ఈ నెలనుంచే పెంపు నిర్ణయం అమలయ్యేలా చర్యలు తీసుకొంటున్నట్టు
తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే రానున్న మూడేండ్లలో రిటైర్ అయ్యే దాదాపు 30 వేల మంది
ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మార్చిలో దాదాపు వెయ్యిమంది రిటైర్ కాబోతున్నారు.
వీరందరికీ మరో మూడేండ్లు సర్వీసులో కొనసాగే అవకాశం లభిస్తుంది. 2021లో మార్చి
నుంచి 9001 మంది, 2022లో 10,201 మంది, 2023లో
11 వేల మంది పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. వీరందరికీ రిటైర్మెంట్ వయసు పెంపు
లబ్ధి చేకూరుతుంది. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయులే.
0 Komentar