టిఎస్: ఇంటర్ లో కృత్రిమ మేధ – రోబోటిక్స్
– కొత్తగా 9 రకాల స్వల్పకాలిక కోర్సులు
కొత్త విద్య సంవత్సరం నుంచి ప్రారంభించటానికి
ఏర్పాటు
విద్యార్థులకు ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానం పై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ స్వల్పకాలిక కోర్సులను
ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. మొత్తం తొమ్మిది రకాల కోర్సులను కొత్త
విద్యాసంవత్సరం(2021-22) నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు
అధికారులు ఇప్పటికే సిలబసను సైతం తయారు చేశారు. పాఠ్యప్రణాళికను జేఎన్‌టీయూ హెచ్
ఆచార్యులకు ఇచ్చిన ఇంటర్ విద్యాశాఖ వారి అభిప్రాయాలను, సూచనలను
స్వీకరించి తగిన మార్పులు చేయనుంది. 'భవిష్యత్తులో ఏ కోర్సు
వారికైనా ఆయా సాంకేతికతలపై అవగాహన ఉండటం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉన్నత
విద్యలో చేరినా అప్పటికే ఉన్న కొంత పరిజ్ఞానంతో సులభంగా నేర్చుకోగలుగతారు' అని ఇంటర్ విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.
కొత్త కోర్సులు ఇవీ..
1.కృత్రిమ మేధ,
2.మెషిన్ లెర్నింగ్,
3.రోబోటిక్స్,
4 .బ్లాక్ చైన్ టెక్నాలజీ,
5.అగ్మెంటెడ్ రియాలిటీ,
6.కోడింగ్,
7.ఎంబెడ్ సిస్టమ్,
8.సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
9.ఇండస్ట్రియల్ ఆటోమేషన్
మరికొన్ని విశేషాలు
* కోర్సును బట్టి కాలవ్యవధి 3 నెలల
నుంచి 9 నెలల వరకు ఉంటుంది.
* కోర్సుల్లో 60 శాతం
ప్రాక్టికల్స్, 40 శాతం థియరీ భాగం ఉంటుంది.
* నామమాత్ర ఫీజు వసూలు చేస్తారు.ఇంటర్ విద్యార్థులు ఏ బ్రాంచీ వారైనా వాటిని ఎంచుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వీటిని అందుబాటులోకి తెస్తారు.
* భవిష్యత్తులో ఈ స్వల్పకాలిక కోర్సులను పూర్తికాల కోర్సులుగా మారుస్తారు. ప్రస్తుతం ఒకేషనల్ లో 40 రకాల కోర్సులను అందిస్తున్నారు
0 Komentar