టిఎస్: 'క్రీడల
కోటా' పంచాయతీ కార్యదర్శుల నియామకాలు రద్దు - త్వరలో కొత్త
నోటిఫికేషన్
రాష్ట్రంలో క్రీడల కోటాలో జరిగిన
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. 9,355 కార్యదర్శుల నియామకానికి రాతపరీక్ష జరిగింది. క్రీడల కోటా కింద 172
ఖాళీలకు 98 పోస్టులను భర్తీ చేశారు. క్రీడల్లో
చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు వారికి అనుకూలంగా
ఉత్తర్వులిచ్చింది. దీంతో నియామకాలను రద్దు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మార్చి 01న
ఉత్తర్వులిచ్చారు. క్రీడల కోటా పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు
చెప్పారు.
0 Komentar