తెలంగాణలో అన్ని యూనివర్సిటీల డిగ్రీ, పీజీ
పరీక్షలు వాయిదా
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని పాపిరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల
దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయాలని
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న
పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయా యూనివర్సిటీలు నిన్న ప్రకటించాయి. ఈ నేపథ్యంలో
సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యామండలి, సెమిస్టర్ పరీక్షలను
వాయిదా వేయాలని యూనివర్సిటీలకు సూచించింది.
0 Komentar