టిఎస్: ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియలో
ప్రాబ్లం – ఇంకా జారీ అవ్వని ద్వితీయ ఇంటర్ హాల్ టికెట్ నంబర్
ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియలో
ప్రతిష్టంభన నెలకొంది. ఈ నెల 20 నుంచి అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చన్న ఎంసెట్ అధికారులు మూడు రోజుల క్రితమే వెబ్ సైట్ ను అందుబాటులోకి
తెచ్చారు. దరఖాస్తు చేసుకోవాలంటే ద్వితీయ ఇంటర్ హాల్ టికెట్ నంబర్ తప్పనిసరి.
వాటిని ఇంటర్ బోర్డు ఇప్పటికీ జారీచేయలేదు. కొందరు విద్యార్థులు శనివారం దరఖాస్తు
చేసేందుకు యత్నించి విఫలమయ్యారు.
ఈనెల 25
లోపు హాల్లో టికెట్లు జారీచేసే అవకాశం లేదని ఎంసెట్ అధికారులకు ఇంటర్‌బోర్డు
చెప్పినట్లు సమాచారం. అంటే మరో 5రోజులు దరఖాస్తు చేసుకోవడం
కుదరదు. ఎంసెట్ కన్వీనర్ ప్రొ.గోవర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్ (ద్వితీయ)
చదివేవారు కాకుండా పాత విద్యార్థులు, డిప్లొమా చేస్తున్నవారు
దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైతే గడువు పెంచుతామని స్పష్టంచేశారు.
0 Komentar