టిఎస్: ఎంపీసీ విద్యార్థులకే
ఎంసెట్ ప్రవేశాలు - ఏఐసీటీఈ పరంగా రాష్ట్రంలో మార్పుండదు
ఇంటర్ లో గణితం, భౌతిక,
రసాయనశాస్త్రాలు చదవకపోయినా బీటెక్ చదవొచ్చని అఖిల భారత సాంకేతిక
విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల్లో మార్పు చేసినా ప్రస్తుతం రాష్ట్రంలో అమలు సాధ్యం
కాదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టంచేశారు. ఇంటర్‌లో
ఎంపీసీ చదివిన వారే ఇంజినీరింగ్ లో చేరాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్యామండలి
కార్యాలయంలో మంగళ వారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఇంటర్లో 14 సబ్జెక్టుల్లో
ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే వారు బీటెక్ లో చేరొచ్చని ఏఐసీటీఈ చేసిన మార్పును
ఈసారి రాష్ట్రంలో అమలు చేయబోమన్నారు.
0 Komentar