టిఎస్: ప్రభుత్వ ఇంటర్
విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని
ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ వారం లోగా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించాలని
ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు.
నిపుణుల ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను బుధ వారం తన
కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల
విద్యార్థులకు సైతం దీన్ని అందించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ను మంత్రి
ఆదేశించారు. తద్వారా దాదాపు 3లక్షల మంది విద్యార్థులకు
ప్రయోజనం కలుగుతుందన్నారు. స్టడీ మెటీరియల్ ను www.tsbie.cgg.gov.in వెబ్ సైట్లో కూడా పొందవచ్చని ఆమె వివరించారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు
కార్యదర్శి జలీల్, సహాయ ఆచార్యులు వసుంధర, సబ్జెక్టు కమిటీ నిపుణులు పాల్గొన్నారు.
0 Komentar