తెలంగాణలో ఏప్రిల్‌లో ఒంటిపూట
బడులు!
ఏప్రిల్ రెండో వారం లేదా మూడో
వారం నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పాఠశాల
విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈసారి కరోనా కారణంగా
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతులకు,
24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష
బోధన ప్రారంభమైంది. మే 26వ తేదీ చివరి పనిదినంగా ఇప్పటికే
ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి నుంచే ఒంటిపూట తరగతులు నిర్వహిస్తే సిలబస్
పూర్తికాదేమోనని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున
అప్పటి నుంచి ఒంటిపూట జరపొచ్చనే భావనకు అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఆ
సమయానికి ఎండలు అధికంగా ఉంటే 6, 7, 8 తరగతులకు సెలవులు
ఇచ్చి...9, 10 తరగతులకు ఒంటిపూట నిర్వహించే అవకాశాన్నీ
పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Darshanam Sandeep
ReplyDelete