TS: ఇంటర్ విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్‌మెంట్ రూపంలో నిర్వహించాలని నిర్ణయం
రాష్ట్రంలో విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను అసైన్‌మెంట్ రూపంలో జరపాలని తెలంగాణ ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని గతంలో బోర్డు నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రతతో కళాశాలల మూతపడినందున అసైన్‌మెంట్ రూపంలో ఇస్తే సరిపోతుందని విద్యార్థులకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ సూచించారు.
మరోవైపు ఏప్రిల్ 7
నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా వాయిదా పడే అవకాశముందని జలీల్ చెప్పారు.
ఈ అంశంలో మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మే1 నుంచి వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
చేస్తున్నామన్నారు. వార్షిక పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేసే ఆలోచన
లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తామన్నారు.
0 Komentar