Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Intermediate Hall Tickets Release Dates Details

 

TS: Intermediate Hall Tickets Release Dates Details

తెలంగాణ ఇంటర్‌ హాల్‌టికెట్ల జారీ తేదీల వివరాలు ఇవే

ఏప్రిల్‌ 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ హాల్‌టికెట్లు - వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్‌

ఎంసెట్‌కు దరఖాస్తుపై ఆందోళన వద్దు - ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి 

తెలంగాణలో ఇంటర్‌ హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఫస్టియర్‌ హాల్‌ టికెట్లను ఏప్రిల్‌ 1 నుంచి జారీ చేస్తామని ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. సెకండియర్‌ హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 2 నుంచి ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇంటర్‌ బోర్డులో కొంత మంది అధికారులు కరోనా బారినపడ్డారు. దీంతో ఆయా సెక్షన్లలోని ఇతర అధికారులు, సిబ్బంది కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఫలితంగా సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ కాస్త జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఏప్రిల్‌ 2 నుంచి సెకండియర్‌ విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. అయితే ఒకటి రెండు రోజులు జాప్యం జరగవచ్చని ఇంటర్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. 

మరోవైపు ఎంసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం.. అందులో సెకండియర్‌ హాల్‌ టికెట్‌ నంబరు నమోదు చేయడం తప్పనిసరి కావడంతో ప్రస్తుతం సెకండియర్‌ చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఎంసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 22న ప్రారంభం కాగా.. మంగళవారం సాయంత్రం వరకు 1319 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి కోరారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండానే మే 15 వరకు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని గుర్తుచేశారు. ఇంటర్‌ సెకండియర్‌ హాల్‌ టికెట్‌ నంబర్లు మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నందున.. ఆ తర్వాత ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

WEBSITE

INTER HALL TICKETS (ENVIRONMENTAL, ETHICS AND HUMAN VALUES)

Second Year Student Check Slip IPE 2021

TS: ఇంటర్ విద్యార్థులు పర్యావరణం, నైతిక విలువల పరీక్షల అసైన్‌మెంట్లు సమర్పించండి: ఇంటర్‌బోర్డు

Previous
Next Post »

2 comments

Google Tags