TS: Key Decision Over Schools Continuation
Due to Increasing Covid Cases
టిఎస్: పరీక్షలు, తరగతుల
నిర్వహణపై కీలక నిర్ణయం - విద్యాశాఖ ఉన్నతాధికారులతో CM సమీక్ష
1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచన
తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో
కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని,
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో గతంలో కూడా ప్రభుత్వం పకడ్బందీగా
చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా
ఉందన్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి సూచనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్
చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
0 Komentar