TS: రేపటి నుంచి
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేత - విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి
COVID-19 – Disaster Management Act, 2005
– Closing of Educational Institutions – Orders – Issued
G.O.Ms.No.67 Dated:23.03.2021
తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు మినహా, ప్రైవేట్ మరియు ప్రభుత్వ అన్ని విద్యాసంస్థలు, తదుపరి ఉత్తర్వుల వరకు మూసివేయబడతాయి.
ఆన్‌లైన్ / దూరవిద్య మునుపటిలాగే
కొనసాగుతుంది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు.
‘‘కరోనా వ్యాప్తిని
అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న
విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం
తీసుకుంది. ఈ మూసివేత ఆదేశాలు వైద్యకళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని
హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ,
ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో
నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయి’’ అని సబితా
ఇంద్రారెడ్డి తెలిపారు.
0 Komentar