Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రాధమిక పాఠశాలకు 5,793 హెచ్‌ఎం కొలువులు – 8,204 మండి టీచర్లకు పదోన్నతులు

 

TS: ప్రాధమిక పాఠశాలకు 5,793 హెచ్‌ఎం కొలువులు – 8,204 మండి టీచర్లకు పదోన్నతులు

కేజీబీవీ ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు

ఉమ్మడి జిల్లాల వారీగా పదోన్నతులు

రాష్ట్రంలో 1-5 తరగతులు నడిచే ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా 5,793 ప్రధానోపాధ్యాయ కొలువులు మంజూరు కానున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)గా పనిచేస్తున్న వారికి సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇచ్చి ఆ పోస్టులను భర్తీ చేయనున్నారు. అవి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)కు సమానస్థాయి పోస్టులు కావడం విశేషం. బాలికల అక్షరాస్యత తక్కువ (లోఫిమేల్ లిటరసీ- ఎల్‌ఎఫ్‌ఎల్ ) ఉన్నచోట వారి అక్షరాస్యత పెంచే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 1997 డిసెంబరు 5న జీఓ ద్వారా ఎ స్ఎల్ హెచ్ఎం పేరిట ప్రధానోపాధ్యాయుల కొలువులు సృష్టించారు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎంల పోస్టులు మంజూరు చేయలేదు. ఇప్పుడున్న వాటితో కలుపుకొని ప్రధానోపాధ్యాయుల సంఖ్య 10 వేలకు చేరేవిధంగా పోస్టులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించడంతో కొత్తగా కనీసం 5,793 కొలువులు వస్తాయని భావిస్తున్నారు. ఈ పదోన్నతులతో రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో 55 శాతం బడుల్లో ప్రధానోపాధ్యాయులు పనిచేయనున్నారు.

- 150 మంది విద్యార్థులుంటేనే హెచ్ఎం పోస్టు

గతంలో ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం ప్రాథమిక పాఠశాలలో అయిదు తరగతులకు కలిపి కనీసం 150 మంది విద్యార్థులుంటేనే హెచ్ఎం పోస్టు మంజూరు చేయాలి. రాష్ట్రంలోని మొత్తం 18,240 ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం కనీసం 15 వేల బడుల్లో విద్యార్థుల సంఖ్య 150 లోపే ఉంది. అంటే నిబంధన మార్చకుంటే పోస్టులు మంజూరు చేసినా ఉపయోగం లేదన్న ప్రశ్న ఉపాధ్యాయ వర్గాల నుంచి వస్తోంది.

* ఉమ్మడి జిల్లాల వారీగా పదోన్నతులు

ఉమ్మడి జిల్లాల వారీగా పదోన్నతులు కల్పిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో మొత్తం 8,204 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి లభించనుంది. అందులో సాధారణ పాఠశాలల్లో 7,868 మందికి, మోడల్ స్కూళ్లలో 336 మంది పదోన్నతులు లభిస్తాయని విద్యాశాఖ తేల్చింది. ఎ్పటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా 6,237 మందికి, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా 1,631 మందికి పదోన్నతులు దక్కుతాయి.

* వేల మంది తాత్కాలిక సిబ్బందికి ప్రయోజనం

తాత్కాలిక ఉద్యోగులకు కూడా వేతన పెంపును వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే దాదాపు 20 వేల మందికి పైగా ప్రయోజనం పొందనున్నారు.

- రాష్ట్రంలోని 475 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేబీజీబీ)ల్లో 5 వేల మంది మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించనున్నారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అసలే అరకొర వేతనంతో (రూ.20 వేల నుంచి రూ.25 వేలు) పనిచేస్తుండగా గర్భం దాలిస్తే వేతనంలో కోత విధిస్తున్నారు. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. అంతేకాకుండా వారితోపాటు బోధనేతర సిబ్బంది దాదాపు 5 వేల మందికి కూడా వేతనం పెరగనుంది. - విద్యా వాలంటీర్లు సుమారు 12 వేల మంది పనిచేస్తున్నారు. వారికి నెల వేతనం రూ.12 వేలు. పీఆర్ నీ ప్రకారం వారికి వర్తింపజేస్తే 25-30శాతం జీతం పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారి చెప్పారు. అంటే కనీసం రూ.15 వేలకు తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పనిచేసేవారు మరికొన్ని వేల మంది ఉన్నారు.

- వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా అంతర్ జిల్లా బదిలీలను వెంటనే చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల దాదాపు 2వేల మంది వరకు ఉపాధ్యాయులకు ఉపశమనం కలగనుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉపాధ్యాయులు వెంటనే వారి రాష్ట్రానికి తిరిగి పంపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. దానివల్ల 600-700 మంది వరకు ఏపీకి వెళ్లిపోనున్నారు. ఏపీ నుంచి మాత్రం తక్కువ మంది ఇక్కడికి వస్తారని చెబుతున్నారు.

* హెచ్ఎం పోస్టుల పరిస్థితి

* రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు: 18,240

- గతంలో మంజూరైన ఎర్ఎస్ఎ హెచ్ ఎం పోస్టులు: 4,207

- అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవారు: 2,386 (1821 ఖాళీ)

* తాజా సీఎం ప్రకటనతో కొత్తగా మంజూరయ్యే పోస్టులు: దాదాపు 5,793

Previous
Next Post »
0 Komentar

Google Tags