TSPSC: Edit Web Options for Staff Nurse
Posts on March 6 And 7th
టిఎస్‌పిఎస్‌సి - స్టాఫ్‌నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు మార్చుకునే ఛాన్స్
గతంలో ఇచ్చిన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకొనే అవకాశం మాత్రమేనని, ఇప్పుడు సమర్పించే వెబ్‌ఆప్షన్లను మార్చే అవకాశం ఉండదని స్పష్టంచేశారు.
మార్చి 6, 7 తేదీల్లో అవకాశం
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో స్టాఫ్‌నర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. గతంలో ఇచ్చిన వెబ్ ఆప్షన్లల్లో చాలామంది పొరపాట్లు చేయడంతో మరోసారి అవకాశం కల్పించినట్టు టీఎస్‌సీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్లు ఇచ్చే క్రమంలో జోన్, డిపార్ట్‌మెంట్‌ను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
ఇది గతంలో ఇచ్చిన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకొనే అవకాశం మాత్రమేనని, ఇప్పుడు సమర్పించే వెబ్‌ఆప్షన్లను మార్చే అవకాశం ఉండదని స్పష్టంచేశారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి 21,391 మందితో మెరిట్ జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే.
వీరిలో 1:2 నిష్పత్తిలో
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ జాబితాను https://www.tspsc.gov.in/
వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు ఇటీవల పేర్కొన్నారు.
0 Komentar