TSRJC-CET-2021 Notification Released
తెలంగాణ రాష్ట్ర గురుకుల
(రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్షా ప్రకటన
Rc.No. 10/TSRJC-CET/2021 తేది:
26-3-2021
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయముల
సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2021-22
విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశం
(ఇంగ్లీషు మీడియం -MPC/BPC MEC) కొరకు జరుగు ప్రవేశ పరీక్షకు
దరఖాస్తులు కోరబడుచున్నవి.
మే-2021లో 10వ తరగతి పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల
విద్యార్థులు అప్లై చేసుకొనవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 01-04-2021 నుండి 30-04-2021 వరకు
దరఖాస్తు రుసుము: రూ.లు. 200/- ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక
జరుగును.
పరీక్ష తేది: 28-05-2021
ఇతర వివరాల కొరకు (http://tsrjdc.cgg.gov.in)లో పొందుపర్చిన సమాచార బులిటెన్ చూడవచ్చును, వివరాలకు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 04024734889, 8008904486
0 Komentar