UGC NET May 2021: Application Last Date Extended
యూజీసీ నెట్ మే - 2021 దరఖాస్తు గడువు పొడిగింపు
యూజీసీ నెట్-2021 పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది.
షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు మార్చి 2 తో ముగిసింది.
యూజీసీ నెట్ 2021 దరఖాస్తు గడువు పొడిగింపు
మార్చి 9
వరకు దరఖాస్తుకు ఛాన్స్
మార్చి 10 లోగా ఫీజు చెల్లించాలి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన చేసింది. యూజీసీ నెట్-2021 పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు మార్చి 2 తో ముగిసింది. అయితే.. తాజాగా గడువు తేదీని ఈ నెల 9 వరకు పొడగిస్తూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల దాఖలుకు ఇబ్బందులు వస్తున్నందున గడువు తేదీని పొడగించాలని అభ్యర్థనలు వస్తున్న నేపథ్యంలో చివరి తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://ugcnet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన అభ్యర్థులు మార్చి 10 లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా తప్పుల సవరణలను మార్చి 16 వరకు చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ పరీక్షలు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహిస్తారు.
యూజీసీ నెట్ 2021 పరీక్షలు మే 2,3,4,5,6,7,10,11,12,14,17 తేదీల్లో
జరుగనున్నాయి. ఇందులో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 100 మార్కుల చొప్పున మొత్తం
200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు.
0 Komentar