Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC: Civil Services (Preliminary) Examination, 2021 Notification Released - Apply Now

 

UPSC: Civil Services (Prelims) Examination, 2021 Notification Released - Apply Now

యూ‌పి‌ఎస్‌సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష – 2021 ప్రకటన విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ సివిల్ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021

మొత్తం పోస్టుల సంఖ్య: 712

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2021 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 02.08.1989 - 01.08.2000 మధ్య జన్మించి ఉండాలి.

ప్రయత్నాల సంఖ్య: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అన్ లిమిటెడ్, ఓబీసీ అభ్యర్థులకు-9 ప్రయత్నాలు.

ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ ద్వారా..

ప్రిలిమినరీ పరీక్ష: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-2 జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ గా ఉంటుంది. దీనిలో 33% అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షను మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పేపర్లు, సిలబస్, ఇతర పూర్తి వివరాలు ప్రకటనలో చూడవచ్చు .

ప్రిలిమ్స్ పరీక్షతేది: 27.06.2021.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేది: 24.03.2021

WEBSITE

DETAILS PAGE

NOTIFICATION

APPLY HERE 

Previous
Next Post »
0 Komentar

Google Tags